ఖమ్మం, ఆగస్టు 12 : ఖమ్మం SR & BGNR ప్రభుత్వ కళాశాల అటానమస్ లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో లైబ్రేరియన్ డాక్టర్ పి విజయ్ కుమార్ అధ్యక్షతన లైబ్రేరియన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏ ఎల్ ఎం శాస్త్రి, భానోత్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి గారు మాట్లాడుతూ విజ్ఞానo అందించడంలో గ్రంధాలయం పాత్ర కీలకమైందని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రంధాలయాల లో మార్పులు రావాలని సూచించారు. సమాజంలో గ్రంథ పాలకుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, సమాజంలోని అన్ని వర్గాల వారికి విజ్ఞాన సంపద అందించడంలో కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ S R రంగనాథన్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ భానోతు రెడ్డి గారు మాట్లాడుతూ డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు కళాశాలలో చక్కటి లైబ్రరీ ఉన్నదని దీనిని వినియోగించుకుని విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ విజ్ఞాన సంపదను వినియోగించుకోవాలని సూచించారు ఐటి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్.ఎఫ్.ఐ.డి తదితర సాంకేతిక పరిజ్ఞానం ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు . డాక్టర్ సీతారాములు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు పటనా శక్తిని పెంచడానికి కళాశాలలో బుక్ రీడర్స్ క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు విద్యార్థులకు ఉచితంగా లిటరేచర్కు సంబంధించిన పుస్తకాలను పరీక్షల సమయంలో అందజేస్తున్నట్లు వివరించారు గ్రంథాలయాల అభివృద్ధి అంటే సమాజ అభ్యున్నతికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విజ్ఞాన సంపదను అందరికీ చేరేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ గారికి పూలమాలలతో నివాళులర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు గ్రంధాలయానికి విశేషంగా కృషి చేసిన డాక్టర్ సీతారాములు గారిని అధ్యాపకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలలోని వివిధ శాఖల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మరియు అకాడమీ కోఆర్డినేటర్ వీరన్న డాక్టర్ సుజాత, ఎస్ రాంబాబు, కే కార్తీక్, శ్రీనివాస సరీన్, రవికుమార్, K కిరణ్ కుమార్, ఐ కిరణ్ కుమార్ , డాక్టర్ రవి, రాజశేఖర్, వెంకట్ రమణ, డాక్టర్ అనురాధ ,మధు, బి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు గ్రంధాలయ సిబ్బంది వీరలక్ష్మి ,మాధవి పాల్గొన్నారు
|
|
|
|
|
|
|
|
|

.jpg)





No comments:
Post a Comment