తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఏట సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ప్రకటించే రాష్ట్ర ఉత్తమ టీచర్ 2024 అవార్డుల ప్రకటించడం జరిగింది ఇందులో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో భాగంగా విజ్జయ్య పల్లి( చిన్నకోడపాక) గ్రామం, గోరి కొత్తపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా కు చెందినటువంటి డాక్టర్ కన్నెబోయిన ఓంకార్, వృక్షశాస్త్ర అధ్యాపకులు మరియు ఎన్సిసి ఆఫీసర్ గా ప్రస్తుతం ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల ఖమ్మం లో పనిచేస్తున్న వారు ఎంపిక కావడం జరిగింది వీరు సామాన్య రైతు కుటుంబ నుండి వచ్చారు,తన ఉన్నత విద్యా మరియు పరిశోధనలు మొత్తం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో పూర్తి చేయడం జరిగింది. ఆ తరువాత 2013లో మొదటిసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కాలేజ్ అధ్యాపకులుగా నియమితులయ్యారు ఎక్కువ కాలం కాకతీయ ప్రభుత్వ కళాశాల హనుమకొండలో పనిచేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఎస్సార్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల, ఖమ్మం కు బదిలీపై వెళ్లారు వీరు అదనంగా గత ఐదు సంవత్సరాల నుండి ఎన్సిసి ఆఫీసర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులను అటు దేశ సేవలో గాని ఇది ఉన్నత విద్యలో గాని అందించడం జరిగింది.ఈ సందర్భంగా తనకు చేదోడువాదోడుగా ఉండి సహయ సహకారాలు అందించినటువంటి కుటుంబ సభ్యులకు గురువులకు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Drop down Menu
Nlist scroll
NLIST e-Journals Search (Library SRBGNR)
Subscribe to:
Post Comments (Atom)
Congratulations 🎉
ReplyDeleteHaving great career and success.